పలు రాష్ట్రాలకు హీరో విజయ్ విరాళాలు

ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు విరాళాంగా ఇచ్చిన విజయ్

Hero Vijay
Hero Vijay

చెన్నై: తమిళ హీరో విజయ్ కరోనా వైరస్‌ పై పోరుకు భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపి రాష్ట్రాల సిఎం రిలీఫ్ ఫండ్స్ కు రూ.5 లక్షల చొప్పున ప్రకటించారు. కాగా, పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలతో పాటు తమిళనాడుకు రూ.50 లక్షలు, కేరళకు రూ.10 లక్షలు, కర్ణాటకకు రూ.5 లక్షలు, పాండిచ్చేరికి రూ.5 లక్షలు, ఫెప్సీకి రూ.25 లక్షలను విజయ్ విరాళాలుగా ప్రకటించారు. కరోనా వ్యాప్తి చెందకుండా చేస్తున్న పోరాటానికి విజయ్ ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిరు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/