జొన్నలో పోషకాలు

ధాన్యాలతో ఆరోగ్యం

చిరుధాన్యాలలో ఒకటైన జొన్నల్లో పోషకాలు, కాల్షియం, ప్రొటీన్లు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బులను దూరం చేస్తాయని వైద్య పరిశోధనల్లో తేలింది.

అంతేకాదు, నరాల బలహీనత, మానసిక రుగ్మత, కాళ్లు, చేతుల మంట, నోటిపండ్లు, వార్ధక్య రుగ్మతల నుంచి కాపాడతాయి.

కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. ఇక సబ్జా అంటే చాలా తెలియక పోవచ్చు.

ఎక్కువగా ఎండాకాలంలో ఉపయోగిస్తారు. సబ్జాగింజలు నానబెట్టిని నీటిని తాగడం వల్ల దాహార్తి తీరడమే గాక దగ్గు, ఆస్తమా, మంట, తలనొప్పి, జ్వరం వంటి సమస్యలు తలెత్తవు.

అదేవిధంగా శరీరంలోని కొవ్వుని తగ్గించడంలో ఇవి భేషుగ్గా పనిచేస్తాయి. అజీర్తిని తగ్గింస్తాయి.

ఇందులో పిండిపదార్థాలతో పాటు మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఇనుము, కాల్షియం, ఫాస్పరస్‌, థయామిన్‌, రైబో ఫ్లేవిన్‌ వంటి పదార్థాలన్నీ ఉన్నాయి.

ఊబకాయంతో బాధపడేవారు కొర్రలను అన్నంలా వండుకుని తినడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/