మంత్రి నిరంజన్ రెడ్డిపై షర్మిల విమర్శలు
పంట లేటుగా వేస్తే, గాలి వాన వస్తే సీఎం ఆపుతాడా?
కొనం కొనం అని చివరకు కొంటానన్న సన్నాసులు ఎవరని నిలదీత

హైదరాబాద్ : వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల మంత్రి నిరంజన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ”పంట లేటుగా వేస్తే, గాలి వాన వస్తే సీఎం ఆపుతాడా? అని చేతకాని మాటలు చెబుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి గారు.. వరి వేస్తే ఉరేనని పంటలు లేట్ గా వేసుకునేలా చేసింది ఎవరు? కొనం కొనం అని చివరకు కొంటానన్న సన్నాసులు ఎవరు?
వానలు వచ్చేకంటే నెల రోజుల ముందే కల్లాల్లో వడ్లు పోసి రైతు తయ్యారుగుంటే మీరేం చేస్తున్నారు? ఎన్ని వడ్లు కొంటానని ఎన్ని కొన్నారు? కాంటాలు పెట్టడం, టార్పాలీన్లు, సంచులు ఇవ్వడం చేతకాలేదు కానీ, పంటలు లేటుగా వేసుకొన్నారు కాబట్టే వర్షానికి వడ్లు తడిసే పరిస్థితి వచ్చింది అని రైతులదే తప్పని చెబుతున్నారా? వడ్లు పండించినందుకు రైతును దోషిని చేస్తున్నారా?” అని షర్మిల నిలదీశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/