భద్రాచలం ఫేమ్ కజాన్ ఖాన్ మృతి

శ్రీహరి నటించిన భద్రాచలం మూవీ లో విలన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు కజాన్ ఖాన్ కన్నుమూశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో ప్రతినాయక పాత్రలు పోషించి స్టార్ విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. సోమవారం (జూన్ 12) రాత్రి గుండెపోటుతో మరణించారు. కజన్ ఖాన్‌ వయసు 46 .

రాజశేఖర్‌ హీరోగా నటించిన అమ్మ కొడుకు సినిమాలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం, పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాలోనూ ప్రతినాయకుడిగా నటించి మంచి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత కజన్‌ తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే తమిళ్‌, మలయాళంలో మాత్రం వరుసగా సినిమాలు చేశాడు. గంధర్వం, సిఐడి మూస, ద కింగ్, వర్ణపకిత్, డ్రీమ్స్, మాయమోహిని, రాజాధి రాజా వంటి మలయాళ సినిమాలతో పాటు తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లోనూ విలనీ పాత్రలు పోషించాడు. గంధర్వం, సిఐడి మూస, ద కింగ్, వర్ణపకిత్, డ్రీమ్స్, మాయమోహిని, రాజాధి రాజా వంటి మలయాళ సినిమాల్లో నటించి మెప్పించారు. 2015లో వచ్చిన లైలా ఓ లైలా అనే మలయాళం మూవీలో ఆఖరి సారిగా నటించాడు.