సింగర్ గీత మాధురి భర్త నందు కు గాయాలు

సింగర్ గీత మాధురి భర్త నటుడు నందు గాయాలపాలయ్యాడు. ఇటీవల చిత్రసీమలో నటి నటులు పలు సమస్యలతో , అనారోగ్యాల బారినపడుతూ చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా సమంత ఓ ప్రాణాంతకమైన వ్యాధి నుండి క్షేమంగా బయటపడింది. ఇదిలా ఉంటె తాజాగా నటుడు నందు గాయాలతో ఉన్న పిక్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

తన కాలికి గాయమైనా, నడవలేని స్థితిలో ఉన్నా కూడా డబ్బింగ్ చెప్పేందుకు స్టూడియోకి వచ్చాడు. ఆ స్టూడియోలో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నాడు. ఈ ఫోటోతోనే నందుకి యాక్సిడెంట్ అయినట్టుగా, కాలికి పట్టి కట్టినట్టు అర్థం అవుతోంది. అయితే ఇది ఎలా జరిగిందనే విషయం మాత్రం చెప్పలేదు. ఇన్ స్టా ను తనిఖీ చేస్తే ఎప్పుడో గాయపడినట్లు తెలుస్తుంది. నందు ప్రస్తుతం సినిమాలు, క్రికెట్ కామెంటరీలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అంతేకాకుండా విపరీతమైన వర్కౌట్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన గాయపడి ఉంటారని సమాచారం.

ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 28 తో పాటు ఆర్‌సి 15,డిజే టిల్లు 2, హరిహరమల్లు, ధాస్ కీ ధమ్కీ సినిమాలతో నందు బిజీ గా ఉన్నారు.