క్రెడాయ్ ప్రాపర్టీ షో లో మంత్రి కెటిఆర్‌

YouTube video

Inaugural ceremony of CREDAI Hyderabad Property Show

హైదరాబాద్‌: తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షో 2020ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. నాలుగేళ్ల క్రితమే మీ సమస్యలన్నీ సిఎం కెసిఆర్ పరిష్కరించారని, కార్యదక్షత, సమర్థత, విజన్ ఉన్న నాయకుడు మనకు లభించడం గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్రం చేసుకున్న అదృష్టమని, కెసిఆర్ నిర్విరామంగా పని చేసే వ్యక్తి అని కొనియాడారు. కెసిఆర్ కృషివల్లే హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆస్థిరత ఉన్నా తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉందని కెటిఆర్ మెచ్చుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/