పవన్ కళ్యాణ్ ఫై క్రిమినల్ కేసు పెట్టాలంటూ వర్మ కామెంట్స్

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మొదటి నుండి కూడా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకి అనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గరి నుండి ఆయన్ను మరింత టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో జగన్ ఫై భజన చేస్తూ వైస్సార్సీపీ కి దగ్గర అవుతున్నారు. ఇప్పటికే జగన్ కు సపోర్ట్ గా సినిమాలు సైతం చేసాడు. ఇదిలా ఉంటె తాజాగా పవన్ కళ్యాణ్ ఏలూరు వారాహియాత్ర లో రాష్ట్రంలో ఆడవారి మిస్సింగ్ ఫై తనకు వచ్చిన సమాచారం గురించి ప్రజలకు చెప్పడం జరిగింది. దీనిపై వర్మ స్పందించారు.

వలంటీర్ల విషయంలో పవన్ ఏదో అన్నాడని, అతనిపై క్రిమినల్ కేసు పెట్టాలని వర్మ చెప్పుకొచ్చాడు. తాజాగా వర్మ చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్, జనసేన శ్రేణులు భగ్గుమంటున్నారు. ‘మోసగాళ్లను వెనుకేస్తున్న వర్మకు పవన్ పై ఎందుకంత కోపం?’ అంటే కామెంట్ల వరద పారిస్తున్నారు. పవన్ వలంటీర్లను అమ్మాయిల బ్రోకర్లు అన్నాడని, దీంతో పవన్ పై కేసు పెట్టాలని వర్మ వారిని రెచ్చగొడుతున్నాడు. సినిమాల్లోనే తన క్రూయిల్ మైండ్ ను ఉపయోగించే వర్మ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఏపీ రాష్ట్రంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నాడని అంటున్నారు. తన మైండ్ సెట్ ఏవిధంగా ఉంటుందో తన సినిమాల ద్వారానే తెలుస్తుందని, ఇప్పుడు రియల్ గా గొడవలు సృష్టించేందుకు వర్మ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని అంటున్నారు. సమాజంలో ఏం జరుగుతుందో తెలియని వర్మ ఇలాగే మాట్లాడుతారని అంటున్నారు. మోసగాళ్లకు వత్తాసు పలుకుతూ వారికి సపోర్టుగా ఉంటూ వర్మ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.

అసలు పవన్ కళ్యాణ్ ఏలూరు సభలో ఏమన్నాడంటే..

మన రాష్ట్రం లోనే కాదు, దేశం లో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది దేశంలోనే అతిపెద్ద సమస్యగా మారుతోంది. ఇది నిన్న మొన్న పుట్టిన సమస్య కాదు, ఎప్పటి నుండో ఉన్న సమస్య. అయితే మన ఆంధ్రప్రదేశ్ లో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. 30 వేల మందికి పైగా ఆడవాళ్లు మిస్ అయితే ఇప్పటికి కేవలం 14 వేల మంది మాత్రమే తిరిగి వచ్చారు, మిగిలిన 16 వేల మంది ఆడవాళ్ళ ఆచూకీ ఇప్పటి వరకు ఎందుకు తెలియలేదు?, కారణం ఏమిటి ? అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. ఏపీ ప్రభుత్వం కూడా దీని మీద ఇప్పటి వరకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. పోలీసులతో కూర్చొని రివ్యూ మీటింగ్స్ ఇప్పటి వరకు జరిపించలేదన్నారు.

‘ వైస్సార్సీపీ లో కొంతమంది కీలక నేతలు వాలంటీర్ వ్యవస్థని వాడుకొని, ప్రతీ ఇంటికి వెళ్లి ఎంత మంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎంత మంది ఆడవాళ్లు ఉన్నారు అనే సమాచారం సేకరించి, ఆ తర్వాత వాళ్ళని మాయం చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నా దృష్టికి తీసుకొచ్చింది. దయచేసి దానిని ఆంధ్ర ప్రజలకు తెలియచేసే బాధ్యత తీసుకోండి అని నాకు చెప్పారు, అందుకే నేను ఈరోజు మీ ముందు వాటి గురించి చెప్తున్నాను’ అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.