చల్లటి లస్సీలతో .. సమ్మర్ కూల్ కూల్

రుచి: వెరైటీ డ్రింక్స్

Variety lassi .. Summer Cool Cool
Variety lassi .. Summer Cool Cool

ఈ వేసవిలో ఇంట్లో ఉండే పిల్లల కోసం రక రకాల పదార్ధాలు చేయటం మామూలే. ఎండగా ఉన్న వేళల్లో లస్సీలు మంచిది.. ఆరోగ్యం కూడా.. వివిధ రకాల ఫ్లేవర్ల లస్సీల తయారీ గురించి తెలుసుకుందాం..

Mango-Lassi-
Mango-Lassi-

మ్యాంగో లస్సీ :

కావాల్సినవి: మామిడి పండు ముక్కలు-కప్పు, చిక్కని పెరుగు-కప్పు, పాలు- పావు కప్పు, యాలకల పొడి-అర చెంచా, చక్కర- రెండు పెద్ద చెంచాలు, డ్రై ఫ్రూట్స్ పలుకులు- రుచికి సరిపడా.

తయారు చేసే విధానం:
డ్రై ఫ్రూట్స్ పలుకులు తప్ప మిగిలిన పదార్ధాలను అన్నీ మిక్సీలో తీసుకుని చిక్కని లస్సీ లా చేసుకోవాలి.. గ్లాసులోకి తీసుకున్నాక డ్రై ఫ్రూట్స్ పలుకులు అలంకరిస్తే చాలు మ్యాంగో లస్సీ రెడీ..

Sabja Lassi

సబ్జా లస్సీ :

కావాల్సినవి: పెరుగు- అర కప్పు, చక్కర-2 టేబుల్ స్పూన్లు, వెనిల్లా ఎసెన్స్-అర చెంచా, నానబెట్టిన సబ్జా గింజలు- ఒక టేబుల్ స్పూను.

తయారు చేసే విధానం :
పెరుగులో చాకీర, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలపండి.. దీనికి నానబెట్టిన సబ్జా గింజలు జతచేసి చల్లగా వడ్డిస్తే చాలా.. చాలా ఇష్టంగా తీసుకుంటారు.

Cucumber Lassi

కుకుంబర్ లస్సీ :

కావాల్సినవి:
కీర దోసలు -రెండు, పెరుగు-అర లీటరు, అల్లం-2అంగుళాల ముక్కలు. కొత్తిమీర తురుము -2 టేబుల్ స్పూన్లు, పచ్చి మిర్చి – రెండు, పంచదార-4 టేబుల్ స్పీస్పూన్లు , ఇంగువ- చిటికెడు, ఉప్పు- రుచికి సరిపడా.

తయారు చేసే విధానం:
కీరా ముక్కలు, అల్లం, కొత్తిమీర, పచ్చి మిర్చి, పంచదార, ఇంగువ, ఉప్పు అన్నీ మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.. అందులోనే పెరుగు కూడా వేసి మళ్లీ తిప్పాలి.. ఇపుడు దీన్ని గ్లాసుల్లో పోసి ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా అందించాలి.

Sweet Lassi

స్వీట్ లస్సీ :

కావాల్సినవి: పెరుగు- కప్పు , పంచదార- ఒకటిన్నర టీ స్పూన్, రోజ్ వాటర్ టీ స్పూన్, చల్లని మంచి నీరు- 2 కప్పులు, పుదీనా ఆకులు- నాలుగు, యాలకులు- ఒకటి..

తయారు చేసే విధానం:
యాలకుల గింజలను మెత్తగా దంచి పొడిలా చేసుకోవాలి.. మిక్సీల పెరుగు, పంచదార, రోజ్ వాటర్, యాలకలు పొడి వేసి , మంచి నీరు పోసి బాగా తిప్పాలి.. ఇపుడుదీన్ని గ్లాసుల్లోకి నింపి పుదీనా తో అలంకరిస్తే చాలు చల్లటి స్వీట్ లస్సీ రెడీ..

‘ఆధ్యాత్మికం ‘ వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/devotional/