నడకలో శక్తి కోసం

వ్యాయామంతో ఆరోగ్యం

For strength in walking
For strength in walking

నడవడమంటే ఉదయం లేవగానే నడకకు బయలుదేరాలి. ఉదయం ఏమీ తినకుండా ఉంటాం కాబట్టి కొంత మందికి పరగడుపున వ్యాయామం చేసినా, వాకింగ్‌కు వెళ్లినా నీరసం వస్తుంది.

అలాకాకుండా వాకింగ్‌కు వెళ్లేందుకు ఒక పావుగంట ముందు ఏదైనా ఒక పండు, లేదా రెండు ఖర్జూరాలు, అదీ కాకపోతే పది ఎండు ద్రాక్షలు వంటివి తినవచ్చు.

ఇలా తినడం వల్ల నడుస్తున్న సమయంలో తగిన శక్తి లభిస్తుంది.

ఒక్కోసారి ఎండ వచ్చాక నడక ప్రారంభించినపుడు ఎండ వేడికి చెమటలు వచ్చి శరీరంలోని నీరు, లవణాలు కూడా కోల్పోతాము.

ఇలా డీహైడ్రేట్‌ అవడం వల్ల కూడా నీరసం ఆవహిస్తుంది. అలా అయితే ఎండ సమయంలో వాకింగ్‌కు వెళ్లాలనుకున్నపుడు చిన్న బాటిల్‌లో మంచి నీళ్లు తీసుకుని వెళ్లడం మంచిది.

వాకింగ్‌ చేస్తూ మంచి నీళ్లు తాగడం వల్ల దాహం తీరడమే కాక. అంత నీరసం కూడా అనిపించదు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/