చలువ చేసే కీరదోస

కాలంతో సంబంధం లేకుండా ఇప్పుడు అందరినీ డీహైడ్రేషన్‌ సమస్య వేధిస్తోంది. అలాంటి వారు ఈ పదార్తాలు తీసుకోవడం మంచిది. కీరలో నీటిశాతం అధికంగా ఉంటుంది. ఇది శరీంలో వేడిని బయటకు పంపేసి చల్లగా మారుస్తుంది. ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. దీన్ని గుండ్రంగా కోసి కళ్లమీద పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. శరీరంలో వేడి తగ్గుతుంది.

ముల్లంగిలో విటవిన్‌ సి ఉంటుంది. నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. దీన్ని కూరల్లో భాగం చేసుకుంటే మంచిది. అందువల్ల డీహైడ్రేషన్‌ సమస్య తగ్గుతుంది. సొరకాయ, బీరకాయలు శరీరంలో నీటి నిలువలు కోల్పోకుండా చేస్తాయి. జ్వరంతో బాధపడుతున్నప్పుడు, గర్భిణులకు ఈ ఆహారాన్ని ఎక్కువగా ఇస్తుంటారు. వీటిల్లో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా బీరకాయలో సి విటమిన్‌, జింక్‌, థయామిన్‌ వంటి పోషకాలు ఉంటాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/