పెసర పాలకూర ఇడ్లీ

రుచి: వెరైటీ వంటకాలు

Variety Dishes: Pesara Spinach Idli

కావాల్సినవి: పెసరపప్పు- కప్పు, పాలకూర- కప్పు, నూనె- రెండు టీ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడినంత, కారం- పావు టీ స్పూను, వంట సోడా- పావు టీ స్పూను.

తయారు చేసే విధానం :పెసరపప్పును శుభ్రంగా కడిగి, ఐదారు గంటలు నానబెట్టుకోవాలి.. నానిన పప్పును మెత్తగా గ్రైండ్ చేయాలి.. పాలకూరను కూడా శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేయాలి.. పాలకూర పేస్ట్ లో రుబ్బిన పెసర పప్పు, కారం, వంట సోడా, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు వేసి కలపాలి.. పిండిని మరీ జారుడుగా కాకుండా తగినంత నీటిని చేరుస్తూ, ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి.. ఇడ్లీ ప్లేట్ కు కొద్దిగా నూనె రాసి పిండిని ఇడ్లీ ప్లేటులో వేసి ఆవిరి మీద ఉడికించాలి.. పదిహేను , ఇరవై నిముషాలు ఉడికిస్తే ఇడ్లీ రెడీ.. పెసర పాలకూర ఇడ్లీ లను పుదీనా చట్నీ లేదా సాంబార్ తో వేడిగా వడ్డించాలి . జాతీయ