మొక్కలకు ఐస్ క్యూబ్స్

ఇండోర్ ప్లాంట్స్- సంరక్షణ

ఇంట్లో పెరుగుతున్న మొక్క అకస్మాత్తుగా చిగురించటం తగ్గుతుంది. నీటిని అందిస్తున్న , నిస్సత్తువగా కన్పిస్తుంది.. టేబుల్ పై కూజాలో పూలు వడిలి పోతుంటాయి.. ఇలాంటి సందర్భాల్లో వాటిని చిటికెలో తాజాగా మార్చివేయొచ్చు . అది ఎలాగో తెలుసుకుందాం..

నీటిలో పెరిగే ఇండోర్ మొక్క వేర్లు కొన్ని సార్లు రంగు మారుతుంటాయి.. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మరికొన్ని రోజుల్లో అది చనిపోవచ్చు… ఆ ప్రమాదం రాకుండా. రెండు కప్పుల నీటిలో పావు చెంచాలో సగం హైడ్రోజన్ పెరాక్సయిడ్ కలిపి మొక్కకు అందించాలి.. దీంతో వేర్లు సాధారణ వర్ణానికి రావటమే కాకుండా, మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది.

క్యూబ్స్ ద్వారా ..

తగిన పోషకాలు అందాకా ఇండోర్ మొక్క చిగురించటం తగ్గుతుంది.. ఇటు వంట చేసేటప్పుడు, కప్పు బియ్యంలో రెండు కప్పుల నీళ్లు పోసి నానబెట్టాలి.. గంట తర్వాత ఈ నీటిని వడకట్టి ఐస్ ట్రే లో నింపి ఫ్రీజర్ లో ఉంచాలి .. నీటికి బదులుగా ఈ కడుగు ఐస్ క్యూబ్ ను టోల్ట్టెలో ఉంచుతుండాలి. ఐస్ కరుగుతూ, మొక్కకు కావాల్సిన పోషకాలు నెమ్మదిగా అందుతాయి.. నాలుగైదు రోజులపాటు వరుసగా నీటిని ఇలా అందిస్తే మొక్కకు తిరిగి తాజాదనం వస్తుంది..

కీటకాలకు దూరంగా ..

డైయింగ్ టేబుల్ పై వుండే మొక్కల భుట్టో చిన్న చిన్న కీటకాలు తిరుగుతుంటాయి.. నారింగా తొక్క ముక్కలను నీటిలో మునిగేలా రెండు రోజులు నాననివ్వాలి.. ఈ మిశ్రమాన్ని వడకట్టి రెట్టింపు నీటిని కలిపి స్ప్రే సీసాలో నింపి మొక్కలపై చల్లితే కీటకాల బెడద తగ్గుతుంది.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/category/telangana/