కంచిపట్టు కొనే ముందు

చీరలు కొని కట్టు కోవడంతో సరిపోదు. దాని భద్రం చేసుకోవడంలోనే మన్నిక ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వీటిని ప్రత్యేక శ్రద్ధతో ఉతకాల్సి ఉంటుంది.

పట్టుచీరను ఉతకడానికి నీరు చాలా మృదువ్ఞగా ఉండాలి. లేకపోతే నీటిలో చిటికెడు బోరాక్స్‌ లేదా అమ్మోనియాను వేయాలి.
ఎన్ని కొత్తరకాల మోడ్రన్‌ చీరలు మార్కెట్లోకి విడుదలవ్ఞతున్నా కంచిపట్టుచీరలకు ఉన్న ఆకర్షణ మరేతర చీరల్లో వ్ఞండడంటే అతిశయోక్తి కాదేమో! అందుకే పెళ్లివేడుకులు అంటే కంచిపట్టుచీరలకే ప్రాధాన్యతనిస్తారు.

అయితే ఇటీవలి కాలంలో జరీకన్న డిజైన్లకీ రంగులకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తుండటంతో జరీ మంచిదా, కాదా అన్న విషయాన్ని పట్టించుకునేవాళ్ల సంఖ్య తగ్గింది. కానీ కంచిచీరలో వాడే పట్టు దారాలు మాత్రం ఇప్పటికీ దాని ప్రాభవాన్ని నిలబెడుతూనే ఉన్నాయి.

అదెలా అంటే రెండుమూడు సహజమైన దారాల్ని మెలి పెట్టి నేయడం వల్ల ఒరిజినల్‌ కంచిచీర ఎంతో మృదువ్ఞగా ఉండి మెరుస్తుంటుంది. చీర బరువ్ఞ ద్వారా కూడా దాని నాణ్యతను గుర్తించవచ్చు. ప్రధానంగా కంచిపట్టుచీర నాణ్యతను తెలియజేసేది పట్టు పోగులతో పాటు జరీ దారాలు ప్రధానమైనవే. అందుకే ఆ చీర మంచిదా, కాదా అనేది తెలియాలంటే జరీని పలకమీద రాసి చూడాలి.

గీత తెల్లగా ఉంటే బంగారు జరీగానూ, ఎర్రగా ఉంటే రాగి జరీగానూ గుర్తించాలి. కాపర్‌ జరీలో వెండి కేవలం 25శాతమే ఉంటుంది. దీన్నే టెస్టెడ్‌ జరీ అంటారు. దీన్ని కరిగించి తిరిగి వాడటానికి సాధ్యం కాదు. అందరినోటా నాణ్యత అనే పేరుమోసిన కంచి పట్టుచీరలను పోలిన చీరలు అనేకం పుట్టుకు వస్తుండడంతో, నకిలీచీరలు కొని మోసపోతామేమో అనే భయంతో ఎక్కువమంది నేరుగా కంచిలో నేసిన చీరలనే కొనడానికి ఇష్టపడుతున్నారు.

అందుకే ఇంట్లో శుభకార్యాలు ఏమి జరిగినా నాణ్యమైన కంచిపట్టు కొనడానికి ఆ మార్కు ముద్ర ఉన్న చీరలకోసం వెతికి మరీ కొనుగోలు చేస్తుం టారు. స్వచ్ఛమైన జరీకి కంచిపట్టుచీర పెట్టింది పేరు. పట్టుదారాన్ని వెండితీగకు కలిపి దాన్ని పుత్తడి ద్రావణంలో ముంచి తీస్తారు.

ఈ జరీ బంగారు రంగులో మెరుస్తుంటుంది. అందుకే కంచిచీర మెరుపు ఎంతకాలమైనా తరగదు. కంచి పట్టుచీర నా ణ్యత నూ, ధర నూ నిర్ణ యించేది ఈ జరీపోగులే. తక్కువరకం జరీ త్వరగా నలుపెక్కుతుంది. ముడుచుకుపోతుంది కూడా.
అదే ప్యూర్‌ జరీ అయితే తిరిగి ఉపయోగించవచ్చు. తరాలు మారినా తరగని కంచి జరీ వైభవాన్ని తెలుసుకోవాలంటే పాత ట్రంకు పెట్టెల్లో అమ్మమ్మలు భద్రంగా దాచుకున్న జరీచీరల్ని పరిశీలించాల్సిందే! ఇవి పాటించాలి: ్య చీరలు కొని కట్టు కోవడంతో సరిపోదు. దాని భద్రం చేసుకోవడంలోనే మన్నిక ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వీటిని ప్రత్యేక శ్రద్ధతో ఉతకాల్సి ఉంటుంది. పట్టుచీరను ఉతకడానికి నీరు చాలా మృదువ్ఞగా ఉండాలి. లేకపోతే నీటిలో చిటికెడు బోరాక్స్‌ లేదా అమ్మోనియాను వేయాలి.
వీటిని గోరువెచ్చని ద్రావణంలో జాడించడం ద్వారా శుబ్రపరచాలి.
చీరను మొదటి సారి ఉతికిన ప్పుడు సబ్బు, డిట ర్జెంట్లు వాడకూ డదు. కుంకుడురసం, మైల్డ్‌ షాంపుల్లో ఉతకడం మంచిది.
మట్టిని తొలగిం చేందుకు వేడినీటిలో రెండు సార్లు జాడించి, తర్వాత చల్లని నీటిలో జాడించాలి. ఆ సమయంలో చల్లని నీటిలో కొన్ని చుక్కల సిట్రిక్‌ ఆమ్లం లేదా ఆసిటిక్‌ ఆమ్లంను కలపాలి.
రంగు పోతుందేమో అని అనుమా నమున్న వస్త్రాలను గోరు వెచ్చని లేదా చల్లని నీటిలో ఉతికేందుకు ముందుగా ఒకటి రెండు నిమిషాలు చిటికెడు సిట్రిక్‌ ఆమ్లం లేదా ఆసిటిక్‌ ఆమ్లం కలిపిన చల్లని నీటిలో నానబెట్టాలి.
ఇస్త్రీ చేసేటప్పుడు జరీమీద కాటన్‌ వస్త్రం చేసి వేస్తే జరీ ముడతపడకుండా మెరుపు తగ్గకుండా ఉంటుంది. అప్పు డప్పడూ చీర మడతల్ని మార్చిపెట్టడం వల్ల త్వరగా చిరగకుండా ఉంటుంది.
డ్రైక్లీనింగ్‌కు ఇవ్వకపోవడమే మంచిది.
ఉతికిన తరువాత నీడనే ఆరవేయాలి. ఆరవేసేటప్పుడు చీరకు కొంగు, కొంగుకు చీర తగిలేలా పొరపొరలుగా వెయ్య కుండా రెండు కొనలకు కూడా రెండ ు కొంగుల్నీ కట్టి ఆర నివ్వాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/