పంచ్ డైలాగులు చెప్పించండి..

పిల్లల సంరక్షణ: పెద్దల బాధ్యత

Child care-An adult’s responsibility


ఎదిగే పిల్లలు తమ భుట్టో జరిగే విషయాలను తెలుసుకోవాలని తహతహ లాడుతుంతారు . దీంతో ఎవరేం మాట్లాడిన ఇట్టే పెట్టేస్తుంటారు. వాటిని తిరిగి ఇతరుల మీద ప్రయోగిస్తుంటారు అందుకే వారి ముందు ఆచీతూచీ మాట్లాడండి… అసభ్య పదజాలం వద్దే వద్దు.

ఇంటి వాతారణమో, సినిమాల ప్రభావమో, పిల్లలు ఒక్కోసారి చాలా పెద్ద మాటలే మాట్లాడేస్తుంటారు… ఆరిందాన్లా ప్రశ్నించటం, గడుసుగా నిలదీయటం, పంచ్ డైలాగులు చెప్పటం బాగుంటుంది.. కానీ, పసితనం కదా.. వారికీ మంచి చెడులు భేదం తెలియదు.. వాటిని పెద్దలుగా మనమే నేర్పించాలి.. వయసుకు మించి మాట్లాడుతూనే అప్పుడే అడ్డుకట్ట వేయాలి..

తప్పు మాట్లాడితే, సారీ చెప్పటం నేర్పించండి.. చిన్నారులు మాట్లాడే విధానాన్ని, పదాన్ని ఎపుడైనా గమనించారా? వాళ్ళ మాటల్లో కఠిన పదాలు డొల్లుతున్నాయా? వెంటనే వాళ్ళని వారించండి.. సందర్భాన్ని బట్టి ఎలా మాట్లాడాలో చెప్పండి.. అంతేగానీ, మీరు వాళ్ళ మాటలకి నవ్వుతూ ఉంటే అదే సైనా పద్దతి అనుకోగలరు.