సంక్రాంతి బరినుండి వారసుడు తప్పుకుంటున్నాడా..?

ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. మహర్షి ఫేమ్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు మూవీ తెలుగు , తమిళ్ భాషలతో పాటు మిగతా భాషల్లో పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేసింది. ఈ మూవీ ని గ్రాండ్ గా జనవరి 11 న విడుదల చేస్తున్నట్లు ముందు నుండి చిత్ర యూనిట్ ప్రకటిస్తూ వచ్చింది.

ఈ మూవీ తో పాటు సంక్రాంతి బరిలో వాల్తేర్ వీరయ్య , వీర సింహ రెడ్డి సినిమాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ టైం లో తమిళ్ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ మొదటి నుండి అంత విమర్శిస్తున్నారు. అయినప్పటికీ దిల్ రాజు మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఏ సినిమాకు వచ్చే జనాలు ఆ సినిమాకు వస్తారని..సినిమా బాగుందంటే వారే వస్తారంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు వెనక్కు తగ్గినట్లు తెలుస్తుంది. తమిళ్ లో యధావిధిగా జనవరి 11 న రిలీజ్ చేసి , తెలుగు లో మాత్రం వాయిదా వేయాలని అనుకుంటున్నాడని తెలుస్తుంది. అయితే, దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.