ఈనెల 10న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం

హైదరాబాద్ః ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కెసిఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతిభవన్‌లో నిర్వహించనున్నారు. ఈ శనివారం జరిగే క్యాబినెట్ సమావేశానికి సిఎం కెసిఆర్‌తో పాటు వివిధ శాఖల మంత్రులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లను మరింత ముమ్మరం చేసే అవకాశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే సొంత స్ఘలాలు ఉన్న బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తామని సిఎం కెసిఆర్ ఆదివారం మహబూబ్‌నగర్ సభలో ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితోపాటు రైతుబంధు నిధుల రిలీజ్, దళితబంధు పథకం అమలు చేయడం లాంటి అంశాలపైన చర్చించే ఛాన్స్ ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/