విజయ సాయిరెడ్డి పై సుప్రీం కోర్టు సీజేఐకి పురందేశ్వరి లేఖ

Purandeswari letter to Supreme Court CJI on Vijaya Sai Reddy

అమరావతిః పురందేశ్వరి, విజయసాయి రెడ్డి మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా సుప్రీం కోర్టు సీజేఐకు విజయ సాయి రెడ్డిపై పురందేశ్వరి లేఖ రాశారు. విజయ్ సాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తన పైన ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విషయంలో 10 ఏళ్లకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారని సీజేఐకు లేఖలో పురందేశ్వరి పేర్కొన్నారు.

బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ.. న్యాయ వ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధిస్తున్నారని ఆగ్రహించారు. విజయసాయి రెడ్డి వ్యవహరంపై విచారణ చేయాలని.. విజయసాయి రెడ్డే కాదు.. జగన్ కూడా పదేళ్ల నుంచి బెయిల్ మీదే ఉన్నారన్నారు. ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని..CBI, IT, ED కేసుల దర్యాప్తు జరగకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటున్నారు…విచారణలు, వాయిదా వేయిచుకోవడం, విచారణకు హాజరు కాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగులో ఉంటున్నాయని పురందేశ్వరి సీజేఐకు లేఖ రాశారు.