రచయిత చంద్రబోస్ ఇంట విషాద ఛాయలు

టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఏడాది ఎంతోమందిని కోల్పోయిన చిత్రసీమ..ఈ ఏడాది కూడా దిగ్గజ నటులను పోగొట్టుకుంటుంది. ప్రముఖ రచయిత చంద్రబోస్ మామ, సుచిత్ర తండ్రి చాంద్ భాష కన్నుమూశారు. చాంద్ భాషా పలు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. తెలుగులో ఖడ్గ తిక్కన్న, బంగారు సంకేళ్లు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు తదితర చిత్రాలకు సంగీతం అందించారు. అలాగే కన్నడలోని పలు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇక ఆయన అంతక్రియలు ఈరోజు హైదరాబాదులోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.

ఇక చంద్రబోస్ విషయానికి వస్తే.. తాజ్‌మహల్ సినిమాలో మంచుకొండల్లోన చంద్రమా అనే పాటతో ఇండస్ట్రీ లో కి రచయిత రంగ ప్రవేశం చేసాడు. ఆ తరువాత కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్ళిసందడి సినిమాలో కూడా అవకాశం వచ్చింది. ఆ సినిమా సంగీత పరంగా కూడా విజయం సాధించడంతో ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. దాదాపు 800 సినిమాల్లో 3300 పాటల్లో పాటలు రాశాడు. ప్రస్తుత కూడా అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోల సినిమాలకు పాటలు రాస్తూ వస్తున్నారు.