వారసుడు మూవీ టాక్

తమిళ్ హీరో విజయ్ – రష్మిక జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించిన మూవీ వారసుడు. తమిళ్ లో వరిసు గా జనవరి 11 న విడుదలై యావరేజ్ టాక్ సొంతం చేసుకోగా..ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి జనవరి 11 నే తెలుగు , తమిళ్ భాషల్లో రిలీజ్ చేయాలనీ దిల్ రాజు భావించాడు. కానీ వాల్తేర్ వీరయ్య , వీర సింహ రెడ్డి చిత్రాల రిలీజ్ ఉండడం తో థియేటర్స్ కు ఇబ్బంది అవుతుందని భావించి, ఈరోజు విడుదల చేసారు. ఇప్పటికే మొదటి షోస్ పూర్తి కాగా..సినిమా ఎలా ఉందనేది ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ నటించిన వారిసు మూవీ సంతృప్తిని మిగిల్చే ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని.. ఫస్టాఫ్ సోసోగానే ఉన్నా.. సెకెండాఫ్ మాత్రం మంచి కమర్షియల్ హంగులతో బాగుందని తమిళంలో టాక్ వచ్చింది. కానీ, తెలుగులో మాత్రం ఇది ఆశించిన రీతిలో లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ట్విట్టర్‌లో చాలా మంది విజయ్ చిత్రానికి నెగెటివ్‌గానే పోస్టులు చేస్తున్నారు. సినిమా బాగా ల్యాగ్‌ అయ్యిందని..దానిని తగ్గిస్తే కానీ సినిమా ఏమాత్రం నిలబడదని అంటున్నారు. మొత్తం మీద వారసుడు సినిమాకు అన్ని చోట్ల మిక్సెడ్ టాక్ వస్తుంది.