చెన్నై- మైసూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ ప్రారంభం

South India’s first Vande Bharat Express trial run between Chennai-Mysore begins

చెన్నై: చెన్నై, మైసూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ చెన్నైలోని ఎం.జి.రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైంది. ఈ రైలును నవంబర్ 11న ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయితే ఇది దక్షిణ భారతదేశంలో అందుబాటులోకి వచ్చే మొట్టమొదటి హై-స్పీడ్ రైలుగా ప్రసిద్ధికెక్కనుంది. అలాగే దేశంలో ఐదవ రైలుగా కీర్తించబడనుంది.

మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 15, 2019న ఢిల్లీ కాన్పూర్ అలహాబాద్ వారణాసి మార్గంలో ప్రారంభమైంది. ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను తీసుకొచ్చారు. అయితే ఆగస్టు 15, 2021న ఎర్రకోట నుండి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో 75 వారాలలో 75 వందేభారత్ రైళ్లు దేశంలోని ప్రతి మూలను కలుపుతాయని ప్రధాని మోడీ ప్రకటించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/