పవన్ వ్యాఖ్యలు కొత్తగా ఉన్నాయంటున్నా సోము

ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు..తాజాగా యువశక్తి సభలో పవన్ చేసిన కామెంట్స్ ఫై స్పందించారు. పవన్ కల్యాణ్ మాటలు కొత్తగా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యల్లో మరింత స్పష్టత వస్తే అందరి కత్తులకు పదునెక్కుతుందని అన్నారు. పవన్ వైఖరికి అనుగుణంగానే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జిల్లా కార్యాలయ ఆవరణలో నిన్న భోగి వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న సోము..ఈ వ్యాఖ్యలు చేసారు. రణస్థలం యువశక్తి సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీకి ఆయన దగ్గరవుతున్నట్టుగా అర్థమవుతోందని, దీనిపై మీ అభిప్రాయమేంటన్న ప్రశ్నకు వీర్రాజు స్పందిస్తూ.. పవన్ మాటల్లో మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఆయన వైఖరికి అనుగుణంగానే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని వీర్రాజు అభిప్రాయపడ్డారు.