రాహుల్ జోడో యాత్ర లో విషాదం..హార్ట్ ఎటాక్ తో ఎంపీ మృతి

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర లో విషాదం చోటుచేసుకుంది.యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో మృతి చెందారు. పంజాబ్ ఫిలోర్ వద్ద యాత్రకు చేస్తుండగా… ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో వెంటనే ఆయన్ను నేతలు, కార్యకర్తలు హాస్పటల్ కు తరలించగా, మార్గ మధ్యలోనే ఆయన కన్నుమూశారు. కాగా సంతొక్ సింగ్ చౌదరి ప్రస్తుతం జలంధర్ ఎంపీగా పనిచేస్తున్నారు. గతంలో పంజాబ్ పంజాబ్ మంత్రిగా కూడా ఆయన పని చేశారు.