ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వల్లభనేని వంశీ కామెంట్స్

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోడ్ ద్వారా వ్యతిరేకంగా ఓటు వేసిన వారిని గుర్తించారని , ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటారన్నారు. చంద్రబాబు నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, టీడీపీ నుంచి దూరంగా ఉన్న నలుగురు ఆ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు రాని వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేశారని వంశీ తెలిపారు. ఎమ్మెల్యేలకు క్యాష్ వచ్చింది…టీడీపీ వాళ్ళకి ఓటు వచ్చిందంటూ వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మా మాజీ బాస్ డబ్బులు చూపి కొనుగోలు చేయడంలో ఎక్స్ పర్ట్ అని… డబ్బులు ఎర చూపి నలుగురిని కొనుగోలు చేసినట్లు తెలిసింది..అందువలనే టిడిపి గెలిచిందని నిప్పులు చెరిగారు. మొన్న తెలంగాణలో అధికారంలోకి వస్తాం అని టీడీపీ అంది ఇప్పుడు ఏపీలో 175 గెలుస్తామని చెబుతుంది, జరిగేవి చెప్పాలన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాలకు వరకే పరిమితం రాజకీయాలు వేరు సినిమా వేషాలు వేరన్నారు. బాలకృష్ణ తాజా డైలాగులపై వంశీ ఈ వ్యాఖ్యలు చేశారు.