తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్‌ జిల్లావాసులు మృతి

తిరుపతిజిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్‌ జిల్లావాసులు మృతి చెందారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లేకు చెందిన ఓ కుటుంబం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లింది. శ్రీవారి దర్శనం అనంతరం ఇంటికి బయలుదేరారు.

ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు మేర్లపాక వద్ద బస్సును ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలతోపాటు చిన్నారి మృతిచెందింది. కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో పోలీసులు వారిని తిరుపతిలోని రుయా హాస్పటల్ హాస్పటల్ కు తరలించారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. బస్సును ఢీకొట్టిన కారు.. రోడ్డు పక్కన ఉన్న చెట్లపొదల్లోకి వెళ్ళింది.