వరంగల్ లో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

bjp-state-president-bandi-sanjay-Padayatra-to-warangal

హైదరాబాద్‌ః బిజెపి రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడతలో చివరిరోజు యాత్రను ప్రారంభించారు. వరంగల్ జిల్లాలోని ఖిల్లా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల నుంచి బండి సంజయ్ యాత్ర ప్రారంభమైంది. బండి సంజయ్​కు స్వాగతం పలికేందుకు యువత, బిజెపి శ్రేణులు భారీగా తరలి తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలతో బండి పాదయాత్ర కోలాహలంగా యాత్ర సాగుతోంది.

వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై మామునూరు మీదుగా యాత్ర సాగుతోంది. జనం భారీగా పాల్గొనటం వల్ల జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు వన్​వే చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్​ను యథాతథం చేసేందుకు పోలీసులు తీవ్రంగా కృషిస్తున్నారు.మరోవైపు.. వరంగల్‌కు వెళ్లే రహదారులు మొత్తం కాషాయమయమయ్యాయి. బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఈరోజుతో ముగియనుండగా.. హనుమకొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు విచ్చేస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, బండి సంజయ్​కు శ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు.. పోటాపోటీగా భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/