మనసుకు హాయిగా కౌగిలింత…

సందర్భం : వాలెంటైన్స్ డే

మాటలెన్ని చెప్పినా మనసైన వారిని హత్తుకుంటే కలిగే మధురానుభూతే వేరు.. ఎంత బాధ అయినా సరే దూదిపింజలా ఎగిరిపోతుంది.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకునే సమయమే తగ్గింది.. దీంతో ఇద్దరి మధ్య అభద్రత చేరి మరింత దూరాన్ని పెంచేస్తోంది.. దాన్ని దూరం చేసేందుకు ముందు మీ భాగస్వామికి ఓ గట్టి హాగ్ ఇచ్చి చూడండి..

కోపాలు, అలకలూ, దాంపత్యంలో సహజమే.. తప్పు ఎవరిదైనా సరే వాదనలు ఆపి, ఒక్క క్షణం నిండు హృదయంతో మీ భాగస్వామిని హత్తుకోండి.. ప్రేమగా మాట్లాడండి. వారి మనసు స్థిమిత పడుతుంది.. దాంపత్య బంధం ధృడ పడటానికి ఇదో తిరుగులేని ప్రేమాయాయుధం.

A cozy hug for the mind

ఓ సినిమాలో హీరో జంతర్ మంతర్ చూమంత్ర కాళీ .. అండర్ ధరద్ దెబ్బకు ఖాళీ అంటూ తన కౌగిలింతల చికిత్స తో ఎదుటివారిలో ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాడు.. నిజంగానే ఈ కౌగిలింత దివ్య ఔషధమే . స్నేహితులు, బంధువులు చివరికి మనం పెంచుకునే కుక్కపిల్లకైనా సరే కృతజ్ఞతలు చెప్పాలన్నా , అభినందించాలన్నా ఓ చిన్న కౌగిలింత చాలు.. మరి దూరంగా ఉన్న మన ప్రియమైన వారికో అంటారా? వర్చువల్ కౌగిలింతలైనా పంపండి. సంతోషపడిపోతారు.