రేపటి నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ

ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Vaccine distribution nationwide from tomorrow
Vaccine distribution nationwide from tomorrow

New Delhi: భారత్ లో రేపటి నుంచి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ  ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా అమలయ్యే కరోనా వ్యాక్సినేషన్ ను ప్రధాని మోడీ నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘం సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు.

తొలిరోజు 3 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందిస్తారని వివరించారు. దేశ వ్యాప్తంగా 3000  కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ నిర్వహించనున్నారు.

తొలిరోజున ప్రతి కేంద్రంలో కనీసం 100 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.  తొలిదశలో 30 మిలియన్ల హెల్త్ వర్కర్లు, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ ఇస్తారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/