బిజెపిలో చేరిన నటి పాయెల్‌ సర్కార్‌

కోల్‌కతా: బెంగాల్‌ నటి పాయెల్‌ సర్కార్‌ గురువారం బిజెపిలో చేరారు. .కోల్‌కతా నగరంలోని భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో సినీనటి పాయెల్ సర్కార్ బిజెపిలో చేరారు. పశ్చిమ బెంగాల్‌లో జరుగనున్న ఎన్నికలకు ముందు బిజెపి, టీఎంసీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు మరో సినీ నటుడు యశ్‌దాస్‌ గుప్తా బుధవారం పార్టీ పశ్చిమ బెంగాల్ ఇన్‌ఛార్జి కైలాష్ విజయవర్గియా, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్‌గుప్తా సమక్షంలో పార్టీలో చేరారు.

అలాగే సీఎం మమతా బెనర్జీ సమక్షంలో పలువురు టీఎంసీ పార్టీలో చేరారు. ఇందులో క్రికెటర్‌ మనోజ్‌ తివారీ, ముగ్గురు బెంగాలీ సినీతారలు రాజ్ చక్రవర్తి, కాంచన్ ముల్లిక్, సయోని ఘోష్ టీఎంసీ తీర్థం స్వీకరించారు. వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో పలువురు సినీతారలతో పాటు ప్రముఖులు అధికార టీఎంసీ, ప్రతిపక్ష బిజెపిలోకి వలసలు కొనసాగుతున్నాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/