‘గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి’: అంబటి

పవన్ కల్యాణ్ పై అంబటి హాట్ ట్వీట్

ambati-rambabu-tweet-against-pawan-kalyan

అమరావతిః జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి’ అని అంబటి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశారు. పవన్ తాజా చిత్రం ‘బ్రో’లో అంబటిని టచ్ చేసేలా ఓ సన్నివేశం ఉంది. గతంలో సంక్రాంతి సందర్భంగా అంబటి రాంబాబు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సన్నివేశమే ఎవరినీ ప్రత్యేకంగా టార్గెట్ చేయని విధంగా ఈ చిత్రంలో ఉంది. అంబటి వేసిన విధంగానే నటుడు పృథ్వితో డ్యాన్స్ చేయించారు. అంతేకాదు ఆరోజున అంబటి వేసుకున్న డ్రెస్ నే పృథ్వికి ధరింపజేశారు. ఈ సందర్భంగా పవన్ కొట్టే డైలాగ్ కూడా అంబటికి సూటిగా తగిలేలా ఉంది. శ్యాంబాబు.. వస్తున్న టెంపో ఏమిటి? నువ్వు వేస్తున్న స్టెప్పులు ఏమిటి? అని పవన్ ప్రశ్నిస్తారు. ఈ సీన్ నేపథ్యంలోనే అంబటి ట్వీట్ చేశారని భావిస్తున్నారు.