నిజామాబాద్‌ జిల్లాలో 1,500 కోళ్లు మృతి

బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు?!

1,500 chickens died in Nizamabad district
1,500 chickens died in Nizamabad district

 Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో స్వల్ప వ్యవధిలో వందల సంఖ్యలో కోళ్లు మరణించడంతో ఒక్క సారిగా భయాందోళనలు  వ్యక్తమౌతున్నాయి. డిచ్‌పల్లి మండలం యానంపల్లి తండా శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో 24 గంటల్లో దాదాపు 1,500 కోళ్లు మృతి చెందాయి. 

చ‌నిపోయిన‌ కోళ్లను అటవీ ప్రాంతంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. అధికారులు  అక్కడి కోళ్ల రక్త నమూనాలను, మృతి చెందిన ఓ కోడిని హైదరాబాద్‌లో ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం త‌ర‌లించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/