సిరివెన్నెల కు నివాళ్లు అర్పించిన మంత్రి పేర్ని నాని

సిరివెన్నెల మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. సిరిలేరు అనే వార్త యావత్ సినీ ప్రేక్షకులనే కాదు రాజకీయ నేతలను సైతం దిగ్బ్రాంతికి గురి చేసింది. నిన్న సాయంత్రం నుండి అంత సిరి గురించే..ఆయన పాటల గురించే మాట్లాడుకుంటున్నారు. కొద్దీ సేపటి క్రితం అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. సినీ ప్రముఖులే కాదు రాజకీయ నేతలు సైతం ఆయన కు నివాళ్లు అర్పిస్తున్నారు. ఏపీ మంత్రి పేర్ని నాని …సిరివెన్నెల పార్థివదేహానికి నివాళ్లు అర్పించారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరపనున్నారు.

1955 సంవత్సరం మే 20వ తేదీన విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెల.. బాలకృష్ణ హీరోగా కళాతపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనని జన్మభూమి’ సినిమాతో గేయ రచయతగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆయన అసలు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి. అయితే 1986లో కే.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ సినిమాకు అన్ని పాటలు రాసి ఈ సినిమాతో చెంబోలు సీతారామశాస్త్రి కాస్తా సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా పేరు తెచ్చుకున్నారు.

న్యుమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల నవంబర్ 24 నుంచి హైదరాబాద్‌లోకి కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. గత రెండు రోజులుగా ఆందోళనకరంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.