చంద్రబాబు కంటే మేము 100 రెట్లు బాగా డీల్ చేస్తాం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఎలా డీల్ చేయాలనే విషయం జగన్ కు తెలుసు: సజ్జల

హైదరాబాద్: వైజాగ్ స్టీల్ ప్లాంటులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదని కేంద్ర చెప్పిన సంగతి తెలిసిందే. ప్లాంటులో 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నిర్మల ప్రకటనను కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకురావడానికి కేంద్రానికి సూచనలు చేశామని… ప్రభుత్వ రంగంలోనే ప్లాంటును కొనసాగించాలని చెప్పామని తెలిపారు.

వైజాగ్ ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ప్రధాని మోడీ కి జగన్ లేఖ రాశారని సజ్జల చెప్పారు. ప్లాంటును వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రానికి సీఎం సూచనలు చేశారని తెలిపారు. వైస్సార్సీపీ ఎంపీలు కేంద్ర మంత్రులను కలసి విజ్ఞప్తులు చేశారని చెప్పారు. కడప, కృష్ణపట్నంకు రావాలని పోస్కో కంపెనీకి జగన్ సూచించారని తెలిపారు. ఆ కంపెనీ ప్రతినిధులు కృష్ణపట్నంకు కూడా వెళ్లొచ్చారని చెప్పారు. పోస్కో కంపెనీకి ఇతర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తోందని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/