రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని గ్లోబర్ స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఈరోజు తన 38 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాంగా RC15 మూవీ కి ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. అంతే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో ఆనందం నింపారు. ప్రస్తుతం చరణ్..డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఈ మూవీ లో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈరోజు చరణ్ బర్త్ డే సందర్బంగా సినిమా తాలూకా టైటిల్ ను తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో రామ్ చరణ్ మునుపెన్నడూ కనిపించని విధంగా గడ్డంతో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. బైక్ పై కూర్చొని వెనక్కి చూస్తూ ఉన్న ఈ లుక్ లో మాస్ ఆడియన్స్ భాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ముఖ్యంగా ఈ లుక్ లో రామ్ చరణ్ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. కాలేజీ రోజుల్లో రెబల్ గా తిరిగే కుర్రాడి తరహాలో ఈ క్యారెక్టర్ లుక్ ఉండటం ఉండటం విశేషం. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈ మూవీ లో శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య తదితరులు నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

YouTube video