మొన్న మధ్య ప్రదేశ్..నిన్న ఆంధ్రప్రదేశ్ ..ఈరోజు ఉత్తర ప్రదేశ్ …యువకుడి ఫై మూత్రం పోసి దాడి

దేశ వ్యాప్తంగా యువకుల దాడులు ఎక్కువై పోతున్నాయి. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్ లో గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఆ తర్వాత ఏపీలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఇక ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆగ్రాలో ఓ యువకుడిపై కొందరు దుండగులు రక్తం కారేలా తీవ్రంగా దాడి చేశారు. అనంతరం నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్న భాదితుడి తలపై తంతూ.. దూర్భాషలాడుతూ.. మూత్రం పోశారు. ఈ ఘటన కు సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆదిత్య అనే ప్రధాని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి సహకరించిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై డీసీపీ (సిటీ) సూరజ్ కుమార్ రాయ్ స్పందించారు. ‘ఒక నిందితుడిని అరెస్టు చేశాము. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాము. ట్విట్టర్​లో వైరల్​ అయిన వీడియో ద్వారా ఈ ఘటనను గుర్తించాము. దీనిపై ఆగ్రాలోని ఏ పోలీస్​ స్టేషన్​లోనూ బాధితుడు ఫిర్యాదు చేయలేదు. అయితే, ఈ ఘటన మూడు-నాలుగు నెలల క్రితం జరిగిందని.. నిందితుడిని ఆదిత్యగా గుర్తించాము. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 307 (హత్య ప్రయత్నం)తో పాటు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము’ అని చెప్పారు.