మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

తండ్రి తుదిశ్వాస విడిచారని తనయుడు అభిజిత్ వెల్లడి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
Pranab Mukharjee

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం చనిపోయారు. ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. వైద్యులు శ్రమపడినా ఫలితం దక్కలేదని, దేశవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు నిర్వహించినా ఫలితం దక్కలేదని తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అభిజిత్ ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ కొన్నివారాల కిందట మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆసుపత్రిపాలయ్యారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఊపిరితిత్తులకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది. కొన్నిరోజులుగా ఆయన కోమాలోనే ఉన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/