బుట్టబొమ్మ మాములు బిజీ గా లేదు

Pooja Hegde latest photoshoot

బుట్టబొమ్మ పూజా హగ్దే ఒకటి , రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలతో బిజీ గా ఉంది. కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ తో ఐరెన్ లెగ్ అనిపించుకున్న పూజా..ఆ తర్వాత డీజే మూవీ తో సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత వరుస హిట్ల తో వెనుకకు చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం ఈమె తెలుగు , తమిళ్ , హిందీ, కన్నడ భాషల్లో ఏకంగా ఆరు సినిమాలు చేస్తుంది. తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తుంది.

అది కాకుండా తమిళంలో ఓ సినిమా, కన్నడలో మరో సినిమా డిస్కషన్ స్టేజిలో ఉన్నాయట. కన్నడలో టాప్ స్టార్ నటించబోయే పాన్ ఇండియా సినిమా కోసం పూజా హెగ్డే పేరు పరిశీలనలో ఉంది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు ఉన్నాయట. హిందీ నుంచి స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు ఛాన్సులు వస్తున్నా… వెంటనే ఓకే చెప్పడం లేదట. తన పాత్రతో పాటు కథ ఎలా ఉంది? కంటెంట్ కనెక్ట్ అయ్యేలా ఉందా? లేదా? వంటి విషయాలు అన్నీ ఆలోచించి ఓకే చెపుతోందట.