యూపీ కౌంటింగ్ : 202 మార్కును దాటి బీజేపీ రికార్డు

రెండోసారి అధికార పీఠం వైపు అడుగులు

Adityanath Yogi-UP Elections- BJP record crosses 202 mark
Yogi Adityanath -UP Elections- BJP record crosses 202 mark

ఉత్తరప్రదేశ్‌లో 18వ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో తాజా సమాచారం ప్రకారం అధికార బీజేపీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా నూతన రికార్డు నెలకొల్పింది . రాష్ట్రంలో బీజేపీ మెజారిటీ పట్టు సాధించింది. . కడపటి వార్తలు అందేసరికి బీజేపీ 202 మార్కును దాటింది. ఇదిలా ఉండగా , ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ తాజాగా అప్డేట్ లో ఓట్ల లెక్కింపు ప్రకారం బీజేపీకి 52 శాతం, బహుజన్ సమాజ్ పార్టీకి 22.1 శాతం, సమాజ్ వాదీ పార్టీకి 16.3 శాతం ఓట్లు లభించాయి. సమాజ్‌వాదీ పార్టీ స్థానాల సంఖ్య 100 దాటింది. బహుజన సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 4,442 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరిలో 560 మంది మహిళలు ఉండటం విశేషం.

అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/