రేపు యాదాద్రిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

KCR Warangal District Tour Cancelled
TS CM Kcr

హైదరాబాద్: సీఎం కెసిఆర్ రేపు యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో ఎన్‌ గీత తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో జరిగే తిరుకల్యాణోత్సవంలో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 21న మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరుపనున్నట్టు సమాచారం. యాగాలు, హోమాలు, పూజలకు కావాల్సిన ఏర్పాట్లతోపాటు యాదాద్రికి వచ్చే భక్తులకు కల్పించే వసతులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రధానంగా యాదాద్రి గర్భాలయంలో బంగారు తాపడం పనులు, కలశస్థాపన తదితర అంశాలపై సమీక్షిస్తారని సమాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/