నేడు ఏపీలో కేంద్ర‌మంత్రి నితిన్ గడ్క‌రీ ప‌ర్య‌ట‌న

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఏపీలో కేంద్ర‌మంత్రి నితిన్ గడ్క‌రీ పర్యటించబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలీకాఫ్టర్‌లో విశాఖ నుంచి ఆయన ఇక్కడకు వస్తున్నారు. ఉదయం పార్వతీపురం చేరుకోనున్న కేంద్రమంత్రి బహిరంగ సభలో పాల్గొంటారు.

ఉద‌యం నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సభలో ప్రసంగించనున్నారు. అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు అనకాపల్లి లోక్ సభ స్థానం పరిధిలో వేపగుంట వద్ద నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం, సాయంత్రం 6.15 గంటలకు గడ్కరీ నాగ్ పూర్ వెళ్లనున్నారు.