సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

cm-revanth-reddy-comments-on-kavitha-and-arvind

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. కొమురం భీం, సిద్ధిపేట జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రేవంత్ రెడ్డి కొమురం భీం జిల్లాలో జరిగే జనజాతర సభకు హాజరు కానున్నారు. అనంతరం సిద్ధిపేట జిల్లాలో జరిగే సభలోనూ పాల్గొంటారు. సిద్ధిపేటలో రోడ్ షోలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రోడ్ షోలకు… మెదక్ పట్టణంలో కూడా రోడ్ షో నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నేడు ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

అనంతరం పాత బస్టాండ్ కూడలిలో జరిగే సభలో ఆయన ప్రసంగించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 17 స్థానాలకు గాను 14 స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.