మోడీ మహానటుడు ఆస్కార్‌కు పంపితే అవార్డు వచ్చేది – మంత్రి కేటీఆర్ సెటైర్లు

ప్రధాని మోడీ మహానటుడు.. ఆస్కార్‌కు పంపితే అవార్డు వచ్చేది అని బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. నేడు కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్బంగా జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. నిన్న గాక మొన్న మన తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. మన పాటకు అవార్డు వచ్చింది. కానీ మన దేశంలో అద్భుతమైన మహానటుడు ఒకాయన ఉన్నాడు. ఆయనే మోడీ అని కేటీఆర్ అన్నారు.
2014లో మోడీ ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. దేశం మొత్తం సంపద దోచి వాళ్ల దోస్తు ఖాతాలో వేస్తున్నాడు. వారి దగ్గర చందా తీసుకోని ప్రతిపక్ష పార్టీల మీద పడుతున్నాడు. పార్టీలను చీల్చి, ఎమ్మెల్యేలను కొని, దేశాన్ని ఆగం చేయాలి. ఇక్కడికి వచ్చిన అద్భుతమైన నటన ప్రదర్శించాలి. మహానటుడు అని ఉత్తగనే అనలేదు. ఇలా నాటకాలు ఆడుతున్నందుకే మహానటుడు అని అన్నాను అని కేటీఆర్ అన్నారు.