అరుణ్‌ జైట్లీ సేవలను కొనియాడిన ప్రధాని

జైట్లీకి నివాళులర్పించిన ప్రధాని

pm-modi-remembers-arun-jaitley

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి దివంగత బిజెపి సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తొలి వర్థంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ‘గతేడాది ఇదే రోజున నా స్నేహితుడిని కోల్పోయాను’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆయన మేధా సంపత్తి, వ్యక్తిత్వ వికాసం మరువలేనివని పేర్కొన్నారు. అరుణ్ జైట్లీ స్మృత్యర్థం నిర్వహించిన సభలో మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకున్నారు. వీడియోను కూడా షేర్‌ చేశారు. అరుణ్ జైట్లీ అనారోగ్యంతో గత ఏడాది ఆగస్టు 24న ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్ను మూశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/