బండి సంజయ్‌ అరెస్టు…డీజీపీకి కిషన్‌ రెడ్డి ఫోన్‌..వివరాలు వెల్లడించని డీజీపీ

police-have-registered-a-conspiracy-case-against-bjp-state-president-bandi-sanjay

హైదరాబాద్: బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టుకు కారణాలేంటో చెప్పాలని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఫోన్‌ చేశారు. కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. కేసు వివరాలు కాసేపటి తర్వాత వెల్లడిస్తామని డీజీపీ సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహించిన కిషన్‌ రెడ్డి.. ఇంత హంగామా జరుగుతున్నా.. ఏ కేసులో సంజయ్‌ను అరెస్టు చేశారో తెలియదా? అని ప్రశ్నించారు. ఇది తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనం. మీరు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు. సంజయ్‌ను కరీంనగర్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి బొమ్మలరామారం పీఎస్‌కు తరలించిన విషయం తెలిసిందే.

మరోవైపు బండి సంజయ్ ను ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో..బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ నుంచి.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వరంగల్ కు తరలిస్తున్నారు.