సిఎం జగన్‌తో ఉక్కు పరిరక్షణ సంఘం నేతల భేటి

విశాఖపట్న: సిఎం జగన్‌తో విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు భేటి అయ్యారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఎన్‌ఎండీసీని విశాఖ ఉక్కుతో అనుసంధానించాలని, దాని వల్ల సొంత గనుల సమస్య తీరుతుందన్నారు. అనుసంధానానికి కేంద్రాన్ని ఒప్పించాలని సిఎంకు ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అనంతరం సిఎం జగన్‌ను కలిసిన కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగబోదని సిఎం హామీ ఇచ్చారని తెలిపారు. సిఎం జగన్ మాటపై మాకు నమ్మకం ఉంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై అందరూ కలిసికట్టుగా పోరాడాలి అని వారు పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/