వడివడిగా పోలవరం పనులు

ప్రాజెక్టు అథారిటీ సిఇఒ చంద్రశేఖర్‌ అయ్యర్‌

  • రేపు సాయంత్రానికి తొలిక్రస్ట్‌ గేటు ఏర్పాటు
  • ప్రాజెక్టును పరిశీలించిన పోలవరం అథారిటీ సిఇఒ
  • త్వరలో మరోదఫా నిధులు కేంద్రం నుండి విడుదల
Polavaram Project Works
Polavaram Project Works

పోలవరం: పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తవుతుందని పోలవరం ప్రాజెక్టు అధారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అన్నారు.ఆదివారం పోలవరం చేరుకుని స్పిల్‌వే,స్పిల్‌ఛానల్‌,ఆర్మ్‌ గర్డర్స్‌పనులు పరి ీలించారు.

ఈ సందర్బంగా ఇరిగేషన్‌ అధికారులు సిఇ సుధాకర్‌ సీఇఒ మాట్లాడుతూ మంగళవారం సాయంత్రానికి తొలిగేటు అమరుస్తామని ఇప్పటి వరుకు జరిగిన పనులు మ్యాప్‌ ద్వారా ఆయనకు వివరించారు.ప్రతి నిర్మాణానికి సంబంధించిన విషయాలను కూడా కులాంకుషంగా పరిశీలిస్తున్న కమిటీసభ్యులు ప్రాజెక్టు పని జరిగిన విధానాన్ని తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు.

సందర్బంగా సీఈవో విలేకర్లుతో మాట్లాడుతూ షెడ్యూల్‌ ప్రకారమే ప్రాజెక్టు పూర్తి అవుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఈవో చంద్రశేఖర్‌ అయ్యార్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు చా లా వేగంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/