మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో ఉగాది వేడుకలు

మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో ఉగాది వేడుకలు అంబరాన్ని తాకాయి. ఈ ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన పంచాగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్ పంచాగ శ్రవణం నిర్వహించారు. అద్వితీయమైన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పయని స్తుందన్నారు. కర్కాటక రాశికి చెందిన చంద్రబాబు ప్రతిష్ట రానున్న కాలంలో మరింత పెరుగుతుందన్నారు. జాతకరీత్యా ప్రజల సొంత గృహ కళ నెరవేర్చేశక్తి చంద్రబాబుకు ఉందన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కూటమి 128 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందుతుందన్నారు.

చంద్రబాబుకు ఈ ఏడాది ఎంతో కలిసొస్తుందని..ఆయనకు అధికార యోగం ఉంది. త్రిమూర్తులు కలయికతో ఏపీకి మేలు జరుగుతుంది. బ్రహ్మ – మోడీ, విష్ణువు – పవన్, ఈశ్వరుడు – చంద్రబాబు. చంద్రబాబు అమరావతి నిర్మాణం చేపడతారు. టీడీపీది వృశ్చిక రాశి. ఈ ఏడాది వృశ్చిక రాశి వారు అనుకున్నది సాధిస్తారు’’ అని పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్ అని అన్నారు.