ఈఏడాది సీఎం జగన్ జాతకం ఎలా ఉందంటే..

విశాఖ శ్రీ శారదా పీఠంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీఠం గంటల పంచాంగాన్ని శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏడాది తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది..తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకం ఎలా ఉండబోతుందనేది తెలిపారు. కాల సర్ప దోషం కారణంగా మూడేళ్లుగా దేశం ఇబ్బందులు పడినట్లు స్వరూపానందేంద్ర తెలిపారు. ఈ ఏడాది చతుర్ గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతోందని.. దీని వల్ల దేశానికి ఇబ్బందులు తప్పవన్నారు. ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటంతో కొంతవరకు ఇబ్బందులు తొలగుతాయన్నారు.

ఉత్తరాదిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయని.. దేశమంతటా వాహన ప్రమాదాలు అధికమవుతాయన్నారు. ఎండలు, వడ దెబ్బలు ఎక్కువగా ఉంటాయని.. జూలై నుంచి సెప్టెంబరు వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతాయన్నారు. పచ్చని పంట పొలాలతో రైతులు బావుండాలని.. ప్రజలు, పాలన బావుండాలని దేవుడ్ని కోరుకుంటున్నాను అన్నారు.