టిడిపి నేత కూన రవిని అరెస్టు చేసిన పోలీసులు

ఆముదాలవలసలో ఉద్రిక్త వాతావరణం

జిల్లా పరిషత్‌ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగుల నిరసన

Kuna Ravi Kumar arrested in amadalavalasa
Kuna Ravi Kumar arrested in amadalavalasa

ఆముదాలవలస: టిడిపి నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సరబుజ్జిలి ఈవోపిఆర్‌డి అప్పలనాయుడిని బెదిరించిన కేసులో ఆయనను ఆముదాలవలస పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అయితే పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ కూన రవి, అతని అనుచరులు ఆముదాలవలస పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న కూన రవి, అతని అనుచరులను చెదరగొట్టి కూన రవిని అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు కూన రవిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదటు నిరసనకు దిగారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/