అన్ని ప‌థ‌కాల్లో పేద‌ల‌కే ప్రాధాన్యం : ప్ర‌ధాని

PM Modi interacts with beneficiaries of Pradhan Mantri Garib Kalyan Anna Yojana of Madhya Pradesh

న్యూఢిల్లీ : ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ నేడు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ కళ్యాణ్ అన్న‌యోజ‌న ప‌థ‌కం ల‌బ్ధిదారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఇంట‌రాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లడుతూ..భార‌త ప్ర‌భుత్వం క‌రోనా సంక్షోభాన్ని ఎదుర్కునే వ్యూహంలో భాగంగా అన్ని ప‌థ‌కాల్లో పేద‌ల‌కే ప్రాధాన్యం ఇస్తున్న‌ద‌ని చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ కళ్యాణ్ అన్నయోజ‌న ప‌థ‌కం అయినా, ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ రోజ్‌గార్ యోజ‌న ప‌థ‌కం అయినా మొద‌టి రోజు నుంచి తాము పేద‌ల ఆహారం, ఉపాధి గురించే ఆలోచిస్తున్నామ‌ని చెప్పారు.

దేశంలో 80 కోట్ల‌ మందికిపైగా జ‌నాభా ఉచితంగా రేష‌న్ పొందుతున్నార‌ని ప్ర‌ధాని తెలిపారు. కేవ‌లం బియ్యం, గోధుమ‌లు, ప‌ప్పులు మాత్ర‌మే కాద‌ని.. దాదాపు 8 కోట్ల‌కుపైగా మందికి లాక్‌డౌన్ సంద‌ర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామ‌ని చెప్పారు. అదేవిధంగా 20 కోట్ల మందికిపైగా మ‌హిళ‌ల జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో 30,000 కోట్ల రూపాయ‌ల‌ను జ‌మ‌ చేశామ‌న్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/