నేడు ప్రధానితో ఉద్దవ్‌ ఠాక్రే భేటి

మర్యాదపూర్వకమే అంటున్న శివ సేన.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

modi-Uddhav Thackeray
modi-Uddhav Thackeray

ముంబయి: ప్రధాని మోడిని మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే ఈరోజు కలవనున్నారు. ఈనేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేగుతోంది. చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇది మర్యాదపూర్వక భేటీయేనని, అతిగా ఊహించుకోవద్దని ఓవైపు శివసేన చెబుతున్నా బాధ్యతలు చేపట్టి దాదాపు మూడు నెలల దాటిన తర్వాత మర్యాదపూర్వక భేటీ ఏంటని, ఏదో ఉందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మహారాష్ట్రంలో కలిసి పోటీ చేసిన బిజెపి, శివసేనలు అధికారం చేజిక్కించుకునేందుకు సరిపడే స్థానాలు సాధించినా ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. అధిక స్థానాలు తమవే కావున సీఎం పదవి తమదేనని బిజెపి స్పష్టం చేస్తే అధికారం చేజిక్కిం చుకునేందుకు తామే కీలకం కావున తమకే ఆ పదవి దక్కాలని శివ సేన పట్టుదలకు పోవడంతో ఇరు పార్టీల మధ్య అఘాతం పెరిగింది. ఎత్తుకు పై ఎత్తు వ్యూహాల నేపథ్యంలో మాటల యుద్ధమే కొనసాగింది. దీంతో శివసేన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపధ్యంలో భాగస్వామ్య పక్షాలు ఎన్పీఆర్ ను వ్యతిరేకిస్తుండగా, అమలు చేసి తీరుతామని శివసేన పట్టుబడుతుండడం చర్చనీయాంశంగా మారింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/